May 18th- Release of Yuva Tourism Clubs Poster on Tourism clubs Activities
Start : 18/05/2026 End : 23/06/2026
Venue : Jangaon

పత్రికా ప్రకటన
ప్రభుత్వ ఆదేశంల ప్రకారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పర్యాటకశాఖ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 18 మే 2026న శ్రీయుత జిల్లా కలెక్టర్ జనగామ వారిచే జిల్లా కలెక్టర్ సమావేశ మందిరము నందు 99 రోజుల కార్యచరణ ప్రణాళికను మరియు యువ టూరిజం క్లబ్స్ కార్యచరణ పైన పోస్టర్ను విడుదల చేయడమైనది.
యువ టూరిజం క్లబ్స్ ముఖ్య ఉద్దేశము పాఠశాలలో మరియు కళాశాలలో పర్యాటక అవగాహన మరియు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ప్రత్యేక విద్యార్థి క్లబ్ ద్వారా ఈ లక్ష్యం నెరవేర్చబడుతుందని పర్యాటక రంగానికి యువ రాయబారులను పోషించి అభివృద్ధి చేయడానికి మరియు పాఠశాలలు కళాశాలలో పర్యాటక అవగాహన సదస్సులు నిర్వహించడం విద్యార్థులను జూనియర్ టూరిజం అంబాసిడర్లుగా నామినేట్ చేసి వారికి శిక్షణ ఇవ్వబడుటకు ప్రభుత్వం రూపొందించింది.
జిల్లా పర్యాటక శాఖ అధికారి
జనగామ జిల్లా.