భూగర్భజల శాఖ
భూగర్భజల శాఖ, జనగామ జిల్లా
శాఖ యొక్క విధులు:
- భూగర్భజల శాఖ, జనగామ జిల్లా, భూగర్భ జలాలకు సంబందించిన జిల్లాలోని అన్ని సంస్థలకు మరియు శాఖలకు అనుబంధ శాఖగా పని చేయును.
- గ్రామ, మండల మరియు జిల్లా స్థాయి భూగర్భ జలాల వినియోగము మరియు మిగులు జలాల అంచన వేయుట.
- SC, ST అభివృద్ధి శాఖలకు సంబంధించి వివిధ పథకాల క్రింద బోరు బావుల నిర్మాణము కొరకు స్థలముల ఎంపిక, భూపంపిణీ పథకం కొరకు మరియు పరిశ్రమల స్థాపన కొరకు TS i-PASS ద్వారా సర్వేలు నిర్వహించడము జరుగుచున్నది.
- నీటి పారుదల శాఖ మరియు పంచాయితీ రాజ్ శాఖలకు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతముల యందు వాన నీటి సంరక్షణ మరియు భూగర్భ జలాల పెంపునకు చెక్ డ్యాంలు, పర్కులేషన్ ట్యాంకులకు చెందిన స్థలముల ఎంపిక మరియు సూచనలు, సలహాలు ఇచ్చుట.
- భూగర్భ జలాల అంచనా కమిటి 2016-17 ప్రకారము జనగామ జిల్లా యందు 76 గ్రామాలు అధిక భూగర్భ జల వినియోగించుచున్నవని అంచనా వేయడమైనది. TS WALT Act ప్రకారం ఈ 76 గ్రామముల యందు నూతన బోర్లు నిర్మాణమును మరియు ఇసుక క్వారీలకు అనుమతులు నిషేదించడమైనది.
- మండల కేంద్రాలు మరియు కొన్ని గ్రామాల యందు గల పీజోమీటర్ల ద్వారా ప్రతి నెల భూగర్భ జల నీటి మట్టాలు కొలిచి రానున్న కాలములో భూగర్భ జల పరిస్థితులపై నివేదిక ప్రభుత్వమునకు ప్రతి నెల సంపర్పించుట.
కార్యాలయ సిబ్బంది:
క్ర.సం
|
పేరు
|
హోదా
|
మొబైల్
నంబర్
|
ఇ-మెయిల్
|
---|---|---|---|---|
1 |
ఎం. అశోక్ |
జిల్లా భూగర్భ జల అధికారి |
9154299820 |
dgwojan@gmail.com |
2 |
సిహెచ్. నర్సింహులు |
అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్
|
9705865357 |
dgwojan@gmail.com |
3 |
టి. అనూష |
అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్
|
9177335963 |
dgwojan@gmail.com |